- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eknath Shinde: 'ఆ ఎమ్మెల్యేలు ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా'
దిశ, వెబ్‌డెస్క్: Maharashtra CM Eknath Shinde Says he will Resign, If rebel MLA's Will Defeat| మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికలను ఎదుర్కోవాలని ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనపై ఏక్‌నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన 40 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ఓడిపోరని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరైనా ఓడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఏక్ నాథ్ షిండే సవాల్ విసిరారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే రెబల్స్ ఓడిపోతారని ఉద్ధవ్ గతంలో వ్యాఖ్యానించారు. తిరుగుబాటు నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే సర్కార్ ముందస్తు ఎన్నికలకు పోవాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి బలం ఎంతో తెలుస్తుందని శివసేనకు ద్రోహం చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రజలు తప్పకుండా ఓడిస్తారని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై షిండే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఎవరూ ఓడిపోరని వారిని గెలిపించుకునే బాధ్యత తనదేనన్నారు. అయితే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో నిర్ణయించడానికి మీరెవరు? అదంతా ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఉద్ధవ్ వర్గం తనతో పాటు తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను దేశ ద్రోహులుగా ముద్రవేస్తోంది షిండే ఫైర్ అయ్యారు. ఉద్ధవ్ వర్గం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. మమ్మల్ని విమర్శించే వారిపై కేసులు లేవు కాని, మాపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయని శివసేన కోసం జైలుకు కూడా వెళ్లానని షిండే గుర్తుచేశారు. బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఆప్ మద్దతు
- Tags
- Eknath Shinde