- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదాద్రిలో చినజీయర్ స్వామి పెట్టిన ముహూర్తం ఫిక్స్.. 7 రోజులు జరగనున్న కార్యక్రమాలు
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఈ నెల 21 నుండి 28 వరకు 7 రోజులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 7 రోజుల పారాయణీకులతో పారాయణం, వేదపండితులతో వేదపారాయణం, పంచకుండాత్మక యాగం బాలాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోమవారం ఋత్విక్ వరుణం, అఖండ జ్యోతి ప్రజ్వలన, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన, వాస్తుపూజ, వాస్తుబలి, వాస్తు హోమం, వాస్తు పర్వగ్నకరణం, శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, ద్వార తోరణ, సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరి రోజున మహాకుంభాభిషేకం ప్రధమ ఆరాధన, ఆరగింపు తీర్ధ, ప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వామి వారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా విచ్చేయు పారాయణీకులకు, భక్తులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నప్రసాదం అందిచనున్నట్లు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని ఈఓ గీతారెడ్డి వెల్లడించారు.