- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి ఊకతో 'వుడ్' ఉత్పత్తి.. 20 వేల చెట్లకు లాభం!
దిశ, ఫీచర్స్ : చెన్నయ్‌కి చెందిన 'ఇండోవుడ్ ఎన్‌ఎఫ్‌సీ(Indowud NFC)' వెంచర్.. వరి ఊకను ఉపయోగించి పర్యావరణానుకూల కలపను రూపొందిస్తోంది. పేరుకుపోయిన ఊక నిల్వలను కాల్చే సమస్యను పరిష్కరించడమే కాకుండా ఫర్నిచర్ తయారీ కోసం చెట్లు నరికివేతకు గురవకుండా కాపాడుతోంది.
పర్యావరణ ప్రేమికుడైన చెన్నయ్ వ్యాపారవేత్త బీఎల్ బెంగానీ.. వాతావరణ మార్పుల గురించి ఆందోళన పడేవాడు. తన వంతుగా ప్రకృతికి ఏదైనా చేయాలని నిత్యం తపించేవాడు. ఈ క్రమంలోనే చెట్ల నరికివేత సమస్యను కొంతలో కొంతైనా తగ్గించేందుకు ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ప్లైవుడ్ స్థానంలో వరి ఊకతో తయారు చేసిన జీరో-వుడ్ బోర్డును అభివృద్ధి చేసేందుకు లక్షలు రూపాయలతో పాటు రెండేళ్ల సమయాన్ని వెచ్చించాడు. ఈ మేరకు 2019లో ఇండోవుడ్ NFC(నేచురల్ ఫైబర్ కాంపోజిట్ బోర్డ్)ని ప్రారంభించాడు. ఈ ఉత్పత్తి టెర్మైట్ ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్, ఫ్లేమ్ రిటార్డెంట్, 100% రీసైకిల్ చేయగలదని.. ఏ పద్ధతిలోనైనా ఆకృతులు చేయొచ్చని ఆయన చెప్పారు. ఇది కలపను వరి పొట్టుతో పాటు ఖనిజాలు, పీవీసీ రెసిన్, ఇతర భాగాలతో భర్తీ చేస్తుంది. జపాన్, దక్షిణ కొరియా నుంచి పీవీసీ రెసిన్ దిగుమతి అవుతుంది.
నాలుగు దశాబ్దాలుగా :
బెంగాని కెరీర్ 80వ దశకంలో ఓ ప్లైవుడ్ దుకాణంలో మొదలైంది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఆయన 'యూనిప్లై ఇండస్ట్రీస్' పేరుతో ఓ కంపెనీ ప్రారంభించగా అది 1996లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ కావడం విశేషం. అయితే పర్యావరణపరంగా 'వాతారణ మార్పుల'ను నిశితంగా గమనిస్తూ వచ్చిన బెంగాని.. స్థిరమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన ఫ్యాక్టరీ పక్కనగల పొలాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించాడు. 2017లో ఈ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ పని ప్రారంభించగా.. ముడి పదార్థాల కచ్చితమైన కలయికను కనుగొనేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఇక 2019లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా ఫైనల్ ప్రొడక్ట్ పూర్తి చేసేందుకు దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. కాగా రైతులు, రైస్ మిల్లుల నుంచి ఈ ఊకను సేకరిస్తున్నామని బెంగానీ చెప్పారు. దీంతో వారికి కూడా కొంత అదనపు ఆదాయం సమకూరుతుందని, దీని ద్వారా దాదాపు 20,000 చెట్లు నరికివేతకు గురవకుండా కాపాడుతున్నామని పేర్కొన్నారు.
ప్లైవుడ్ మాదిరిగా కాకుండా ఈ NFCని ఏ రూపంలోనైనా అచ్చు వేయోచ్చు, ఆకృతి చేయొచ్చు. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలదు. అంతేకాదు దీనిని GFRC (గ్లాస్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్) స్థానంలో ఎక్స్‌టీరియర్స్ కోసం ఉపయోగించవచ్చు. ఇది నీరు, టెర్మైట్ ప్రూఫ్ కాబట్టి చాలా కాలం పాటు మన్నికగా ఉంటుంది.