తిరుపతి రైల్వే ఘటనపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ మద్దిల గురుమూర్తి

by Vinod kumar |
తిరుపతి రైల్వే ఘటనపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ మద్దిల గురుమూర్తి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిలిచిపోయిన వర్షపు నీటిలో వాహనం మునిగిపోవడం వల్ల మరణించిన సంఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ జరిపిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. భారీ వర్షాలు లేదా వరదలు సంభవించినప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జిలలో నీరు చేరడాన్ని తనిఖీ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.


దేశంలో గత పదేళ్లలో రాష్ట్రాల వారీగా ఇలాంటి ఘటనల్లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య ఎంతో తెలపాలని కోరారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. తిరుపతి రైల్వే అండర్ బ్రిడ్జి నం.150 వద్ద జరిగిన సంఘటనపై విచారణ జరిగిందని, ఆ ఘటన జరిగిన రోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటన్నర సమయం భారీ వర్షం కురవడంతో భారీగా వరద చేరిందని కొట్టుకు వచ్చిన వ్యర్థాలు డ్రైనేజి వ్యవస్థకి అడ్డుపడడం మరియు ఆ ప్రవాహానికి తగిన డ్రైనేజి అందించలేకపోవడం తో అండర్ బ్రిడ్జి వద్ద అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగిందని తెలిపారు. ఫలితంగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.


కొత్తగా నిర్మాణం చేసే అండర్ బ్రిడ్జిలలో ఇలాంటి డ్రైనేజి సమస్యలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే నిర్మించిన అండర్ బ్రిడ్జిలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచే విధంగా దగ్గరలోని అత్యవసర పరిస్థితుల్లో నీటిని త్వరగా బయటకు తీయడానికి పంపుల ఏర్పాటు, దగ్గరలోని కాలువలకు నీటిని మళ్లింపు చేసే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గుర్తించిన ప్రాంతాల్లో వర్షాకాలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. వరదలు/రుతుపవనాల సమయంలో రైల్వే అండర్ బ్రిడ్జిలను నిశితంగా గమనించాలని కీమెన్/పెట్రోలింగ్‌కు సూచించబడిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed