నిరసనలో యువజంట 'ముద్దు'లాట!

by S Gopi |   ( Updated:2022-09-03 12:43:37.0  )
నిరసనలో యువజంట ముద్దులాట!
X

దిశ, ఫీచర్స్ : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే దేశం విడిచి పారిపోవడంతో పరిస్థితి విషమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక నివాసాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని నివాస భవనం వద్ద వేలాదిమంది నిరసనకారుల సమక్షంలో ముద్దు పెట్టుకున్న ఓ జంట ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీలంక మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరైన పరిష్కార మార్గాన్ని కనుగొనలేక అధికారులు పోరాడుతుండగా.. ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కొందరు హింసాత్మకమైన నిరసనలను ఆశ్రయిస్తే, మరికొందరు ఇలాంటి విపత్కర సమయాల్లో కూడా ప్రేమ వికసిస్తుందని చూపించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ మేరకు కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయం వద్ద జనాలు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో, హెల్మెట్ ధరించిన వ్యక్తి తన భాగస్వామి పెదవులపై ముద్దు పెట్టుకుంటున్న ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ ఫొటోపై చాలామంది 'కపుల్ గోల్స్' అంటూ కామెంట్ చేశారు.

మాజీ అధ్యక్షుడు రాజపక్సే బుధవారం నాడు దేశం విడిచి మాల్దీవుల్లోని మాలేకు, ఆపై సింగపూర్‌కు పారిపోవడంతో గత కొన్ని రోజులుగా ద్వీప దేశంలో పరిస్థితి గందరగోళంగా మారింది. గోటబయ నిష్క్రమణ, తదనంతరం రాజీనామా చేసిన వెంటనే విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహీందా యాపా ప్రకటించడంతో నిరసనలు మిన్నంటాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించగా, కర్ఫ్యూ ఆదేశాలను సైతం ధిక్కరించి వేలాది మంది తమ జాతీయ జెండాతో ప్రధానమంత్రి కార్యాలయ భవనాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వ భవనాల్లో ప్రజలు విశ్రాంతి తీసుకోవడం, స్నానం చేయడం, ఫొటోలు దిగడం వంటి వీడియోలు, ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed