ఎన్నికల్లో ఓడిపోతే.. పార్టీ అంతమైనట్లు కాదు: రాజస్థాన్ సీఎం

by Vinod kumar |   ( Updated:2022-04-03 16:45:38.0  )
ఎన్నికల్లో ఓడిపోతే.. పార్టీ అంతమైనట్లు కాదు: రాజస్థాన్ సీఎం
X

జైపూర్: ఎన్నికల్లో ఓడిపోతే, పార్టీ అంతమైనట్లు కాదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలోపేతం గా ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని హెచ్చరించినవన్నీ నిజమేనని తేల్చిచెప్పారు. ప్రధాని విపక్షాన్ని సీరియస్‌గా తీసుకుని, దానికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు.


'1977 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి చవిచూసింది. ఇందిరా గాంధీ కూడా ఓటమి పాలయ్యారు. కానీ, ఆ తర్వాత పార్టీ బలంగా పుంజుకుని అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా, కాంగ్రెస్ ముగిసిందని కాదు' అని తెలిపారు. గెహ్లాట్ తాజాగా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రహిత భారత్ అనే చర్చ నడుస్తోందని, అయితే ఇంకో 100 ఏళ్లైనా అది జరగబోదని చెప్పారు. ప్రధాన మంత్రి విపక్ష నేతలు చెప్పేది వినాలని తెలిపారు.


'ప్రతిపక్షాలు మీకు హెచ్చరికలు మాత్రమే ఇస్తాయి. రాహుల్ గాంధీ ప్రభుత్వానికి చేసిన హెచ్చరికలు వాస్తవం. కావున మోడీ ప్రతిపక్ష నేతలు చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి' అని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా విపక్ష నేతల చెప్పిన విషయాన్ని వింటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed