- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్ఐసీ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సునీల్ అగర్వాల్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) సంస్థకు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)గా రిలయన్స్-నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ సునీల్ అగర్వాల్‌ను నియమించనున్నట్టు తెలుస్తోంది. గతంలో రిలయన్స్-నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సీఈఫ్ఓ గా పనిచేసిన తర్వాత సునీల్ అగర్వాల్ దాదాపు రెండు దశాబ్దాల పాటు జీవిత బీమా సంస్థల్లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎల్ఐసీలో చేరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలం పాటు ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా రెండు ప్రధాన జీవిత బీమా కంపెనీల్లో పని చేసిన ఆయన ఎల్ఐసీలో కొత్తగా ఏర్పాటు చేసిన బాధ్యతలను స్వీకరించనున్నారు. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓకు వస్తున్న నేపథ్యంలోనే ఎల్ఐసీ సంస్థలో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థానాన్ని సీఎఫ్ఓ గా మార్చారు. సునీల్ అగర్వాల్‌కు ముందు ఈ బాధ్యతలను శుభాంగి సంజయ్ సోమన్ నిర్వహించారు. అయితే, దీనిపై ఎల్ఐసీ అధికారికంగా ప్రకటించలేదు. ఐపీఓ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా దీనిపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది.