- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూసైడ్ పర్మిషన్ కోసం వారు రాష్ట్రపతి, గవర్నర్‌కు లేఖ..
దిశ, టేకులపల్లి: స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 14 ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్నారు. మారుమూల గిరిజన ఆవాసాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలనందు గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం చాలీ చాలని వేతనాలతో వారు పని చేస్తున్నటువంటకీ 2018 -19 సంవత్సరంలో ఆ నాటి ఐటీడీఏ పీవో పమెల సత్పతి 11 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను ఆ కారణంగా తొలగించారు. పలుమార్లు సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, గిరిజన ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరిగిన కూడా ప్రయోజనం లేకుండా పోయిందిదని, గత్యంతరం లేక తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం అయినా హైకోర్టును 2018లో ఆశ్రయించామని ఉపాధ్యాయులు తెలిపారు.
2020 సంవత్సరంలో హైకోర్టు న్యాయమూర్తి M.S రామచందర్ రావు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేసి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చారని వివరించారు. ఆ జడ్జిమెంట్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఇంప్లిమెంటేషన్ చేయకుండా దానిపై అప్పీల్‌కి వెళ్లారని వారు తెలిపారు. డివిజన్ బెంచ్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజి లతో కూడిన ధర్మాసనం తిరిగి మమ్మల్ని వీధుల్లో కాంట్రాక్టు పద్ధతిపై తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు (28-12-2021) ఇచ్చి నాలుగు నెలలు కావస్తున్నా కూడా ఐటీడీఏ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా జడ్ చోగ్తు, గిరిజన శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీ గిరిజనులు కేవలం హైకోర్టును ఆశ్రయించి చీఫ్ జస్టిస్ ఆర్డర్ ను తీసుకు వచ్చినా.. మాకు న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ అయిన అమలు చేయండి.. లేదా మాకు చనిపోవడానికి అయిన అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి, గవర్నర్ కు సూసైడ్ లేఖ రాసినట్లు తెలిపారు. దీనికన్నామించి గిరిజనులుగా మేం ఏం చేయలేమని, గిరిజన సంక్షేమ శాఖ కుర్చీలో కూర్చొని గిరిజనులకు న్యాయం చేయకుండా పని చేస్తున్నటువంటి గిరిజన శాఖ కమిషనర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేశారు. లేఖ రాసిన వారిలో అజ్మేరా శివలాల్, ధారావత్ బాలాజీ, భూక్య లక్ష్మణ్, గుగులోత్ రూప్లా ఉన్నారు.