అమ్మ..! మీ పోరాట స్పూర్తికి నా సెల్యూట్

by Vinod kumar |
అమ్మ..! మీ పోరాట స్పూర్తికి నా సెల్యూట్
X

దిశ, తుంగతుర్తి: అమ్మ..! మీ పోరాట స్ఫూర్తి కి నా సెల్యూట్..! మీ చరిత్ర భావితరానికి మార్గదర్శిగా నిలిచిపోతుంది. మీలాంటి వీరోచిత వీరులను కన్న తుంగతుర్తి గడ్డ పై రెండు పర్యాయాలు ఎన్నిక అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్న.. నీ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడమే మేమిచ్చే నిజమైన నివాళి అంటూ తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ మల్లు స్వరాజ్యం కు నివాళులు అర్పించారు.


నల్లగొండ జిల్లా కేంద్రంలో స్వరాజ్యం భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాజ్యం మృతితో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వరాజ్యం సాగించిన అనేక పోరాటాలు చరిత్ర మరచి పోదని పేర్కొంటూ స్మరించుకున్నారు. ఇదే నా సెల్యూట్ అంటూ నివాళులు అర్పించారు.

Advertisement

Next Story

Most Viewed