- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్ న్యూస్... మళ్లీ మెరిసిన తెల్లబంగారం
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పత్తి పంటకు ఆల్‌టైం రికార్డు ధర పలికింది. వారం రోజుల నుంచి రూ.10 వేల మార్క్ ను దాటుకుంటూ వస్తున్న తెల్ల బంగారం.. సరిగ్గా వారం రోజుల తరువాత గురువారం క్వింటాల్ పత్తికి 11,025 రూపాయలు పలకడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తి పంటకు రికార్డు స్థాయి ధర పలుకుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ వ్యాపారులు సైతం పోటీపడుతుండడం వంటి కారణాలతో ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పంటను సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. దీంతో గరిష్ఠ ధర క్వింటాకు రూ.11,025 పలికింది. పత్తికి భారీ స్థాయిలో ధర పలుకుతుండడంతో పంటను నిల్వ ఉంచుకున్న రైతులు లాభపడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ రీత్యా కొద్ది రోజుల్లోనే రూ.12 వేల మార్క్‌ను సైతం దాటే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా దేశీ మిర్చికి సైతం మంచి ధర లభిస్తోంది. బుధవారం ఎనుమాముల మార్కెట్లో క్వింటా దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 52 వేల మార్క్ ను దాటిన విషయం తెలిసిందే. గురువారం రూ. 2 వేలు తగ్గి రూ. 50 వేలు పలికింది. మిర్చి, పత్తి పంటలకు మంచి ధర లభిస్తుండటంతో ఈ రెండు పంటల ఉత్పత్తుల రాకతో ఎనుమాముల మార్కెట్ కళకళలాడుతోంది.