కొత్త జంటకు తప్పిన ప్రమాదం.. రాత్రి పెళ్లి.. పొద్దున యాక్సిడెంట్

by Disha News Web Desk |
కొత్త జంటకు తప్పిన ప్రమాదం.. రాత్రి పెళ్లి.. పొద్దున యాక్సిడెంట్
X

దిశ, ఏపీ బ్యూరో: రాత్రి పెళ్లి చేసుకున్న జంట తెల్లారేసరికి యాక్సిడెంట్‌కు గురైంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో నవ జంటకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గత రాత్రి కాకినాడలో వివాహం ముగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి మచిలీపట్నం వస్తున్న పెళ్లి జంట ఆదిత్య, శ్రావణి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ గురైయింది.

కౌతవరం గ్రామం వద్ద మంచు కారణంగా డ్రైవర్‌కు రోడ్డు సరిగా కనపడకపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాల్వలో బోల్తా కొట్టింది పెళ్లికారు. అదృష్టవశాత్తూ పెళ్లి జంట స్వల్ప గాయాలతో బయటపడగా అదే కారులో ప్రయాణిస్తున్న ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. క్రొత్త జంట కాళ్ల పారాణి ఆరకముందే ప్రమాదం జరగడంతో షాక్‌కు గురయ్యారు కుటుంబ సభ్యులు.108 వాహనం ద్వారా గాయపడినవారిని మచిలీపట్నంకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed