- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Komatireddy Rajagopal Reddy: రాజీనామాపై రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో : Komatireddy Rajagopal Reddy Gives Clarity On his Resignation| రాజీనామాపై వస్తున్న ఊహాగానాలకు రాజగోపాల రెడ్డి చెక్ పెట్టారు. పార్టీకి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. గతంలోనే తనను టీఆర్ఎస్ లోకి రావాలని పిలిచారని, వ్యక్తిత్వాన్ని అమ్ముకోనని, ఇక ముందుకు కూడా చేయనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని, డబ్బు సంచులతో వచ్చి గెలుస్తారా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోట్ల రూపాయలు దాన, ధర్మాలు చేస్తూ ఇన్ని నిందలు పడటం అనవసరమని ఈ నిర్ణయం తీసుకున్నామని, రాజకీయ జీవితానికి, వ్యాపార జీవితానికి ఎక్కడా సంబంధం లేదని, స్వార్థం కోసం రాజీనామా చేయడం లేదన్నారు. నిజాయితీపరుడైన తనను ఇలా విష ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, తన పోరాటం కుటుంబ పాలనపైన అని, తన పోరాటం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం కోసమని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయలేకపోతుందని, ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, కానీ ఎమ్మెల్యేగా గెలిపించారని, అయినా ఏం చేయలేకపోయాయనని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇంకా 18 నెలల సమయం ఉందని, కానీ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి కొంతైనా అభివృద్ధి జరుగుతుందనే రాజీనామా చేస్తానని, గతంలో కూడా అభివృద్ధి చేయకుంటే రాజీనామా చేస్తానని తన నియోజకవర్గ నేతలకు హామీ ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమ్ముడు పోయారని కొంతమంది వ్యక్తులు బద్నాం చేస్తున్నారని, అమ్ముడుపోయే మనస్తత్వం తన రక్తంలో లేదని. ఆస్తులను అమ్మి సంపాదించిన సొమ్మును పేద ప్రజలకు ఇచ్చానని, సొంత డబ్బుతో కాపాడుకున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారాలతో విషయం చిమ్ముతున్నారన్నారు. తప్పుడు ప్రచారాలతో తనను నమ్ముకున్న ప్రజలు ఆయోమయానికి గురవుతున్నారన్నారు. గతంలోనే తనను టీఆర్ఎస్ లోకి రావాలని పిలిచారని, వ్యక్తిత్వాన్ని అమ్ముకోనని, ఇక ముందుకు కూడా చేయనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
పోరాటంలో కాంగ్రెస్ విఫలం
ఇక కాంగ్రెస్ అధిష్టానంపైనా రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయనని, గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే కూడా ఏఐసీసీ నుంచి కనీసం సమీక్ష కూడా లేదన్నారు. ప్రస్తుతం మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతుందని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఉండి చేసేదేమీ లేదని, తన పోరాటం టీఆర్ఎస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద అని, కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో పోరాటం చేయలేదని, అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలోకి "మంత్రి ఎర్రబెల్లి" సోదరుడు..?