కాలేయ వ్యాధి లక్షణాలు.. జాగ్రత్త!

by Mahesh |   ( Updated:2022-07-11 14:43:44.0  )
కాలేయ వ్యాధి లక్షణాలు.. జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్: ఆల్కహాల్ కారణంగా లివర్ డ్యామేజ్ అవుతుందన్న విషయం తెలిసిందే కాగా.. ఇందుకు సంబంధించిన డిసీజ్‌ను ARLD(ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్) అని పిలుస్తారు. సంవత్సరాల తరబడి మద్యానికి బానిసకావడం వల్ల కాలేయానికి నష్టం కలిగి 'సిర్రోసిస్' అనే తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది.

లివర్ డిసీజ్‌కు కారణాలేంటి?

లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌లో.. ఆల్కహాల్ యూజ్, ఒబిసిటీ వంటి అలవాట్లు లివర్(కాలేయం) ఫంక్షనింగ్‌ని దెబ్బతీస్తాయి. వీటి అసాధారణ పనితీరుకు వైరల్ అటాక్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్స్ కూడా ఒక కారణం. కాగా ఏళ్ల తరబడి అధికంగా ఆల్కహాల్‌ని డ్రింక్ చేయడం వల్ల లివర్‌లో మంట, వాపు ఏర్పడి 'సిర్రోసిస్' (ఇది ప్రాణాంతక డిసీజ్. లివర్ సెల్స్ దెబ్బతిని, నశించిపోయి వాటి సామర్థ్యం తగ్గిపోతుంది) పరిస్థితికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్ వచ్చినప్పుడు.. బ్లడ్ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడం, బ్లడ్‌లో సుగర్‌ లెవెన్‌ని మెయింటేన్ చేయడం, పిత్త ఉత్పత్తి, బ్లడ్ ప్లాస్మా కోసం ప్రోటీన్ల ఉత్పత్తితో పాటు ఇతర శారీరక విధులు బలహీనపడతాయి.

ARLD సమస్యను సూచించే సాధారణ లక్షణాలేంటి?

లివర్ డిసీజెస్‌ లక్షణాలను కనుగొనడం చాలా కష్టం. ఇవి ఎటువంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండవు. అయినప్పటికీ ఈ వ్యాధులు బాడీలో డెవలప్ చెందడం ప్రారంభించిన నుంచి కొన్ని ప్రభావాలు కనిపిస్తాయి.

సాధారణ విషయాలపై ఫోకస్ చేయలేకపోవడం.

కన్‌ఫ్యూజన్‌గా, గందరగోళంగా అనిపించడం.

మానసిక స్థితిలో మార్పులు రావడం.

పూర్ జడ్జిమెంట్ సామర్థ్యం

కాలేయ వ్యాధి ఇతర లక్షణాలు?

అలసట

చెప్పుకోలేనంత బరువు తగ్గడం

చీలమండలంలో వాపు

పొత్తికడుపు వాపు

ఆకలి లేకపోవడం

ఎల్లో కలర్ ఐస్ అండ్ స్కిన్

నిద్రమత్తు

బ్లడ్‌తో కూడిన వాంతులు

మలంలో రక్తం

ARLD(ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్) కాంప్లికేషన్ సమస్యలు?

పోర్టల్ హైపర్ టెన్షన్ అండ్ వైరసెస్ : లివర్‌లో అధికంగా మచ్చలు ఏర్పడినపుడు ఇది జరుగుతుంది. ఈ స్టేజ్‌లో బ్లడ్ అనేది లివర్ గుండా వెళ్లదు. అందువల్ల బ్లడ్ హార్ట్‌కు చేరుకునేందుకు చిన్న రక్తనాళాలను యూజ్ చేస్తుంది. తద్వారా చిన్న రక్త నాళాలు బలహీనపడతాయి. చివరికి చిట్లిపోయి రక్తం వాంతుల రూపంలో బయటకు వస్తుంది. లేదా మలద్వారం గుండా పోతుంది.

అసిటిస్ : ఇలాంటి సమయంలో పొట్ట చుట్టూ ఒక ద్రవం పేరుకుపోతుంది. దీనికి ట్రీట్మెంట్ చేసినప్పటికీ ద్రవం యొక్క ఇన్ఫెక్షన్ మూత్ర పిండాలను దెబ్బతీయడమే కాక.. ప్రాణాంతకం కూడా కావచ్చు.

హెపాటిక్ ఎన్సెఫలోపతి : లివర్ బ్లడ్ నుంచి విషాన్ని రిమూవ్ చేయలేనపుడు ఇది జరుగుతుంది. దీనిలో కాలేయం ఫిల్టర్ చేయలేకపోవటం వల్ల రక్తంలో ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed