గాంధీ భవన్ నుంచి అగ్రికల్చర్ కార్యాలయం వరకు 'కిసాన్ మార్చ్'

by Nagaya |
గాంధీ భవన్ నుంచి అగ్రికల్చర్ కార్యాలయం వరకు కిసాన్ మార్చ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులను విస్మరించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, అందుకు నిరసనగా ఈ నెల 11న గాంధీ భవన్ నుంచి అగ్రికల్చర్ కార్యాలయం వరకు కిసాన్ మార్చ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు, అగ్రికల్చర్ కమిషనర్‌కు వినతి పత్రం ఇవ్వనునట్లు కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతేడాది బడ్జెట్ తో చూస్తే.. 745.65 కోట్లు కోతపెట్టారని, రైతు భీమా, రైతు బంధు‌కే ఎక్కువ నిధులు కేటాయించారని అన్నారు. ధరల స్థిరీకరణకు మొండి చేయి ఇచ్చారని తెలిపారు. పంటల రుణమాఫీకి భారీగా నిధుల ప్రతి బడ్జెట్‌లో పేరుకు మాత్రమే కేటాయింపులు చేశారని, ఆచరణలో ఇప్పటి వరకు మాఫీ చేసింది కేవలం 1098 కోట్లు మాత్రమేనని తెలిపారు.

టీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ మాఫీ చేసింది లేదన్నారు. ఈ మూడేళ్లలో వేయి 98 కోట్లు మాత్రమే మాఫీ చేశారని, బడ్జెట్ లో కేవలం ప్రకటనగానే ఉందన్నారు. యాంత్రికరణ కోసం 1100 కోట్లు గతేడాది కేటాయిస్తే.. ఇప్పుడు 377.35 కోట్లేనని, డ్రిప్ ఇరిగేషన్ కోసం కోటి 25 లక్షలు కేటాయించారని, పంటల కొనుగోలు, వడ్ల కొనుగోలు కోసం పైసా పెట్టలేదన్నారు. ఉద్యానవన శాఖకు వెయ్యి కోట్లు అని పెట్టిన ఉత్తదేనన్నారు. పంటల రుణమాఫీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం గత రబీ, ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో జరిగిన అవినీతి, నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం ద్వారా రైతులకు రావాల్సిన నష్టపరిహారం, కనీస మద్దతు ధరల జాబితాలో ఉన్న ప్రతి పంటను కొనుగోలు చేయాలని, ఈ యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రైతు భీమా కాకుండా 194 జీఓ ప్రకారం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనే అంశాలన్నీ అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.

Advertisement

Next Story