KA Movie : గొప్ప మనసు చాటుకున్న కిరణ్ అబ్బవరం.. అంధ విద్యార్థుల కోసం ఏం చేశారంటే..?

by Anjali |   ( Updated:2024-11-05 12:57:51.0  )
KA Movie : గొప్ప మనసు చాటుకున్న కిరణ్ అబ్బవరం.. అంధ విద్యార్థుల కోసం ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళికి విడుదలైన ‘క’(KA Movie) సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ మూవీ రూ. 26 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో పాటుగా.. ప్రేక్షకులు ఊహించని విధంగా క్లైమాక్స్ తో విపరీతంగా ఆకట్టుకుంటోంది. మౌత్ టాక్ తో మరింత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక క సినిమా విడుదల అనంతరం కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ టీమ్ కొన్ని థియేటర్లను కూడా సందర్శించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) అంధ విద్యార్థులకోసం క మూవీ స్పెషల్ షో వేయించారు.

ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్‌లో రెండు అంధ విద్యార్థుల స్కూళ్ల పిల్లలకు క చిత్రాన్ని చూపించాడు కిరణ్ అబ్బవరం. లైటింగ్ ఎఫెక్ట్స్(Lighting effects), సౌండ్స్ (Sounds) తో సరికొత్త అనుభూతిని పొందారు విద్యార్థులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. హీరో కిరణ్ అబ్బవరంపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. క మూవీ విడుదలయ్యాక కూడా కిరణ్ ఫస్ట్ ఓ అంధ విద్యార్థులు(Blind students) ఉండే ఆశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు.

Advertisement

Next Story