విశాఖలో కేజీఎఫ్ చిత్ర యూనిట్ సందడి..

by Satheesh |
విశాఖలో కేజీఎఫ్ చిత్ర యూనిట్ సందడి..
X

దిశ, ఉత్తరాంధ్ర: సోమవారం కేజీఎఫ్ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. హీరో యష్, సినిమా నిర్వాహకులు విశాఖ చేరుకుని.. ముందుగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హీరో యష్ మాట్లాడుతూ.. తమ సినిమా టిక్కెట్ల విషయంలో తెలుగు రాష్ట్ర సీఎంలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కొవిడ్ వలన సినిమా ఇండస్ట్రీ చాలా నష్టాల్లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. అందుకే తమ సినిమా భారీ బడ్జెట్‌గా మారిందని.. అభిమానులు కోరుకుంటే కేజీఎఫ్ పార్ట్ 3 కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అనంతరం సినిమాలో ట్రేండింగ్ అయిన వైలెన్స్ డైలాగ్‌తో అలరించారు.

Advertisement

Next Story