- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KGF 2: బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాఖీబాయ్ .. స్టార్ హీరోల రికార్డ్‌లు బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్ 2 సినిమా.. రికార్డ్ కలెక్షన్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రాఖీ బాయ్ అద్భుత నటనకు.. పలు ఇండస్ట్రీ రికార్డ్‌లు బద్దలవుతున్నాయి. తాజాగా యశ్ దెబ్బకు.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేకైంది. హిందీలోకి డబ్ ఈ అయిన చిత్రం.. బాలీవుడ్ స్టార్ హీరోల రికార్డ్‌లను సైతం బద్దలుకొడుతూ.. బాలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నిలిచింది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు తొలిరోజు అత్యధిక కలెక్షన్‌లు సాధించిన వార్(51.60), థగ్స్ ఆఫ్ హిందుస్థాన్(50.75) సినిమాల పేరిట ఉన్న రికార్డ్‌ను తాజాగా కేజీఎఫ్ 2(53.95) కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.
ఈ విషయాన్ని ప్రముఖ మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రంగాన్ని ఏలిన బాలీవుడ్‌కు ఇటివల కాలంలో సౌత్ ఇండియా సినిమాలు గట్టి పోటీనిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఓ డబ్బింగ్ చిత్రం.. తొలిరోజు అత్యధిక కలెక్షన్‌లు సాధించిన మూవీగా నిలువడం సాధారణ విషయం కాదు. బహుబలితో మొదలైన సౌత్ ఇండియా సినిమాల హావా ఇటివల విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌తో మరింత ఎక్కవైంది. సౌత్ ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
- Tags
- KGF2