- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎఫ్2, ఎఫ్ 3కి డిఫరెన్స్ ఇదేనంట ?
దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్ 2. ఇది ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఇక ఈ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం కోసం ఎంతో మంది అభిమానులు ఎందురు చూస్తున్నారు. కాగా, వేసవి సెలవుల సందర్భంగా మే 27న ఎఫ్ 3 ప్రేక్షుల ముందుకు రానుంది.
ఎఫ్ 3 కూడా తెలుగు మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకున్న మరో ఆయుధం అవుతుందా అనుకుంటున్నారా..? కానీ భార్యలు, అత్తమామల పై ఉల్లాసమైన కామెడీని అనిల్ రావుపూడి ఎఫ్2 ద్వారా అందించి మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఎఫ్ 3 దానికి భిన్నంగా ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈసారి మహిళలకే అనుకూలంగా సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఎఫ్3 మొత్తం 'డబ్బు' చుట్టూనే తిరుగుతుందని కథనాలు వస్తున్నాయి. 'లబ్బు డబ్బు' పాట ఇప్పటికే హింట్ ఇవ్వగా, మధ్యతరగతి కుటుంబాలు డబ్బు వెంట పరుగెత్తితే ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన అంశంగా తెలుస్తోంది. మహిళలపై సెటైర్లు వేయడం కంటే, ఈసారి అనిల్ మధ్యతరగతి డబ్బు మనస్తత్వాన్ని, ధనవంతులు పేదలను ఎలా దోపిడీ చేస్తారనే దానిపై లక్ష్యంగా పెట్టుకొని సినిమా తీసినట్లు తెలుస్తోంది.