టార్గెట్ తెలంగాణ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర ముహుర్తం ఫిక్స్..

by Satheesh |
టార్గెట్ తెలంగాణ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర ముహుర్తం ఫిక్స్..
X

దిశ, నాచారం: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 14న పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ కో కన్వీనర్ బొట్ల సాయిలు వెల్లడించారు. మల్లాపూర్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా ఇంచార్జి సోమ్నాథ్ భారతి తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల కృషి ఫలితంగా అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రకు మార్గం సుగమమైందన్నారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ.. కార్యకర్తలకు, నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం దిశగా సోమ్నాథ్ భారతి కృషి చేశారని కొనియాడారు. పంజాబ్లో ఆప్ పార్టీ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రణాళికలు రచించి సీఎం పీఠం దక్కించుకోవడం కోసం వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పేరు వింటేనే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. పంజాబ్ ఫలితాలను జీర్ణించుకోలేక కేసీఆర్ అనారోగ్యానికి గురైనట్లు ఎద్దేవా చేశారు. ఇటీవల ఆప్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జరుగుతున్న పోరాటం, పంజాబ్ ఫలితాలు తోడుకావడంతో కేసీఆర్‌కు వణుకు పుట్టిందన్నారు. ప్రజలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత ఉచిత విద్యుత్ సరఫరాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఆప్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో పాటు అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed