- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arvind Kejriwal: నా నివాసంపై బీజేపీ కార్యకర్తలే దాడి చేశారు : కేజ్రీవాల్
దిశ, వెబ్‌డెస్క్ : తన నివాసంపై చేసిన గుండాగిరి, రాజకీయ హింసకు ముగింపు పలకాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆ నిరసనకారులు బీజేపీకి చెందినవారు. వారు నా ఇంటికి వచ్చారు. గోడల కూలగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. మేము అక్కడ లేము. ఎవరైనా అలా ఇంటిపై దాడి చేసే హక్కును కలిగి ఉంటారా? అని సీఎం అన్నారు.
తన జీవితం ముఖ్యం కాదని, అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పిస్తానని చెప్పారు. నేను గత 15 రోజులో ఆహారం తీసుకోకుండా ఉన్నాను. నేను డయాబెటిస్ వ్యాధిగ్రస్తుడిని. ఇలాగే ఉంటే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ గుండాగిరి దేశానికి మంచిది కాదు' అని తెలిపారు. తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. కశ్మీరీ పండిట్ల గురించి బీజేపీ నిజంగా ఆందోళన చెందలేదని అన్నారు. మారణహోమం జరిగినపుడు బీజేపీ అధికారంలో ఉందని చెప్పారు. కశ్మీరీ పండిట్లకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఇప్పటికి వరకు బీజేపీ ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదని విమర్శించారు. వారంతా బీజేపీపై ఆగ్రహాంతో ఉన్నారని చెప్పారు.