Keerthy Suresh: ఎట్టకేలకు ప్రేమ విషయాన్ని బయటపెట్టిన కీర్తి సురేష్.. లవ్ యు డార్లింగ్ అంటూ పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-11-04 12:46:08.0  )
Keerthy Suresh: ఎట్టకేలకు ప్రేమ విషయాన్ని బయటపెట్టిన కీర్తి సురేష్.. లవ్ యు డార్లింగ్ అంటూ పోస్ట్!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) తెలుగులో ‘మహానటి’ (Mahanati )సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇటీవల ‘దసరా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ‘రఘుతాత’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ ‘బేబీ జాన్’(Baby John) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన కీర్తి నటించనుండగా.. డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది.

ఇక కీర్తి సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ నెటిజన్ ‘‘లవ్ యు డార్లింగ్.. ఈ రోజు నా పుట్టిన రోజు.. నీ నుంచి విషెస్ ఆశిస్తున్నా’’ అని పోస్ట్ పెట్టాడు. అయితే దీనికి కీర్తి సురేష్(Keerthy Suresh) స్పందిస్తూ.. ‘లవ్ యు టూ డార్లింగ్ హ్యాపీ బర్త్ డే’ అని రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక తన ప్రేమను బయట పెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed