- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమస్యలు సృష్టించడం కేసీఆర్‌కి బాగా అలవాటు: ఏఐసీసీ
దిశ, తెలంగాణ బ్యూరో: రంగస్థలం సినిమాలో జగపతి బాబు లెక్క.. కేసీఆర్ తయారయ్యాడని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. లేని సమస్యలు సృష్టించి వాటిని పరిష్కరించినట్టు నటించడం సీఎం కేసిఆర్‌కి అలవాటన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ధర్నా కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ధర్నాల పేరుతో రైతులను మభ్య పెడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో సీఎంది దొంగ దీక్ష అని, రైతులను దగా చేసే కుట్ర జరుగుతుందన్నారు. బీజేపీ ఇందిరా పార్క్‌లో దీక్ష చేసుడు సరికాదన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్‌లు డ్రామాలు చేస్తున్నాయని, ఇద్దరూ ధర్నాలు చేస్తే.. రైతులను ఆదుకునేది ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ ఉప్పుడు బియ్యం ఇవ్వమని చెప్పి లేఖ రాశాడని, కేంద్రం ధాన్యం టార్గెట్ అడిగితే ధాన్యం ఇవ్వబోమని కేసీఆర్ చెప్పాడని, ఇప్పుడు దొంగ దీక్షలు ఏంటని ప్రశ్నించారు. కేంద్రం యాసంగి పొక్యూర్మెంట్ పాలసీ మార్చి వడ్లు క్వింటాల్‌కు 55 కిలోల బియ్యం తీసుకుంటే ఎవరికి నష్టం లేకుండా రైతులకు లాభం జరుగుతుందన్నారు.
యాసంగి లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం కారణంగా బియ్యం బదులు క్వింటాల్‌లో 15 కిలోల నూకలు వస్తాయన్నారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే వెయ్యి కోట్ల తేడా వస్తుందన్నారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాత్రం భరించలేవా అని మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్‌లో వరి ధాన్యం తానే కోంటా అని తీర్మానం చేస్తాడన్నారు. రైతుకు మద్దతు ధర ఎవరు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి పూర్తి స్థాయిలో వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.