- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న 'కార్తికేయ 2' టీమ్
దిశ, సినిమా : 'థాంక్యూ' మూవీ కోసం తమ రిలీజ్ డేట్(జులై 22)ను ఏకంగా ఇరవై రోజుల పాటు వాయిదా వేసుకుని 'కార్తికేయ 2' టీమ్ పెద్ద పొరపాటు చేసిందనే చెప్పాలి. నిజానికి నాగ చైతన్య 'థాంక్యూ' చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉండటంతో 'కార్తికేయ2' మేకర్స్ వెనకడుగు వేశారు. కానీ ఆ సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సోమవారం చాలా వరకు మల్టీప్లెక్సుల్లో షో క్యాన్సిల్ అయ్యేదాకా వెళ్లింది. అంతేకాదు వీకెండ్‌తో కలిపి మొత్తం మూడు రోజుల్లో నాలుగు కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో 'కార్తికేయ 2' బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని, ఇపుడు ఆగస్టు 12న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో పోటీపడాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముందే ఫిక్స్ అయిన తేదీకి విడుదలై ఉంటే.. మంచి ఓపెనింగ్స్ దక్కేవని, ఆగస్టు 12 ఫైట్‌లో నిఖిల్, నితిన్.. ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో చూడాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు.