ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన కరీనా.. అసలు విషయం చెప్పేసింది!

by Nagaya |   ( Updated:2022-07-20 07:49:24.0  )
ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన కరీనా.. అసలు విషయం చెప్పేసింది!
X

దిశ, సినిమా : బీటౌన్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.. ఇటలీలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫొటో షేర్ చేయగా.. కరీనా అందులో బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ముచ్చటగా మూడోసారి గర్భం దాల్చిందనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లను కొట్టి పడేసిన కరీనా.. అవన్నీ అసత్యాలని తేల్చేసింది. ఎలాంటి డైట్ మెయింటైన్ చేయకుండా బాగా తిని, తాగడం వల్లే పొట్ట పెరిగిందని స్పష్టం చేసింది. 'హేయ్ ఇది కేవలం పాస్తా, వైన్ మాత్రమే. కాస్త ప్రశాంతంగా ఉండండి. నేను గర్భం దాల్చలేదు. ఉఫ్.. ఇప్పటికే మన దేశంలో జనాభా పెరిగేందుకు ఎక్కువగా కృషి చేశానని సైఫ్ అంటున్నారు. కాబట్టి నేను గర్భవతిని కాదు.. ఎంజాయ్' అంటూ నెటిజన్ల కామెంట్స్‌కు రిప్లయ్ ఇచ్చింది కరీనా.

kareenaKapoorKhan addresses pregnancy rumours: SaifAliKhanhas already contributed way too much to the population of India

Advertisement

Next Story