పెళ్లైన హీరోలు అమ్మాయిలపై కన్నేస్తున్నారు.. Kangana Ranaut షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2022-04-10 08:25:49.0  )
పెళ్లైన హీరోలు అమ్మాయిలపై కన్నేస్తున్నారు.. Kangana Ranaut షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై విమర్శలు చేసింది. ప్రస్తుతం 'లాక్ అప్' షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కంగన..లేటెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 'ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి పెళ్లయిన పురుషులకు అట్రాక్ట్ అవుతోంది. ఈ విషయాన్ని నా వ్యక్తిగత అనుభవం నుంచే చెబుతున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న పురుషులు యువతులను ఆకట్టుకునేందుకు కట్టు కథలతో రకారకాల జిమ్మిక్కులు చేస్తారు. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు సైతం యంగ్ ఉమెన్‌ను బుట్టలో వేసుకుంటున్నారు. పెళ్లయిన వ్యక్తిని, అతని భార్య నుంచి రక్షించగలిగేది తామేనని చాలామంది యువతులు భావిస్తున్నారు' అంటూ వివరించింది.

ఇక తాను ఎవరి గురించి చెప్తున్నానో అందరికీ అర్థమయ్యు ఉంటుందన్న కంగన.. ఇలాంటి అనుభవాన్ని తన జీవితంలో పెద్ద కుంభకోణంగా భావిస్తానని, పురుషుల కోణం నుంచి కాకుండా భార్యల వైపు స్టోరీ వింటే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారని పేర్కొంది. ప్రస్తుతం హృతిక్ రోషన్.. యంగ్ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కంగన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed