'మౌంట్ దెనాలి' పర్వత శిఖరాన్ని అధిరోహించిన ముంబై కిడ్.. రికార్డుల మోత

by Manoj |   ( Updated:2022-07-05 08:21:48.0  )
మౌంట్ దెనాలి పర్వత శిఖరాన్ని అధిరోహించిన ముంబై కిడ్.. రికార్డుల మోత
X

దిశ, ఫీచర్స్ : చాలామంది పిల్లలు తమ యుక్త వయస్సు నుంచే నిర్లక్ష్య జీవితాన్ని గడపాలని కలలు కంటుంటారు. దీంతోపాటు ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ పిల్లల్లో ఒక వ్యసనంగా మారిపోయింది. ఇక మొబైల్స్‌తో చాలా టైం కేటాయిస్తున్న క్రమంలో.. ముంబైకి చెందిన 12ఏళ్ల బాలిక వీటన్నింటికి భిన్నంగా విభిన్న ప్రణాళికలు, లక్ష్యాలను నిర్దేశించుకుంది.

ప్రస్తుతం పిల్లలు మొబైల్ గేమ్స్, సిరీస్‌లు, సినిమాలంటూ ఆన్‌లైన్‌లో కాలం గడుపుతుంటే.. ముంబైకి చెందిన 12 ఏళ్ల బాలిక కామ్య కార్తికేయన్ మాత్రం విభిన్న ప్రణాళికలు, లక్ష్యాలను నిర్దేశించుకుంది. నేవీ చిల్ర్డన్స్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న కామ్య.. ఉత్తర అమెరికాలోని దాదాపు 20,310 అడుగుల ఎత్తైన 'మౌంట్ దెనాలి' పర్వత శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.

నార్త్ అమెరికాలో రిమోట్ అలస్కాన్ శిఖరం ఎత్తైనది. దీన్ని అధిరోహించడం అత్యంత కఠినం కూడా. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని కామ్య ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించే మార్గంలో ఐదవ మైలురాయిని అధిగమించిందని రక్షణ మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా నివేదించింది. ఇక దీంతోపాటు మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ విన్సన్, అలాగే పోలార్ స్కీ ట్రావర్‌లు మిగిలి ఉన్నందున.. ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేయడానికి కామ్య ఆరోగ్యంగానే ఉందని.. బహుశా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు అని ప్రకటనలో పేర్కొంది.

ఇక నేవీ కమాండర్ ఎస్ కార్తికేయన్ కుమార్తె అయిన కామ్య.. ప్రస్తుతం 'సరస్' మిషన్‌లో భాగంగా 'ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్ స్లామ్'ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా జనవరి 2021లో కామ్య అసాధారణమైన పర్వతారోహణ విజయాలలో అత్యున్నత జాతీయ పౌర పురస్కారమైన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed