- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త చేసిన పనికి రోజుకొకరు ఇంటికి వస్తున్నారు.. కలెక్టర్ గన్‌మెన్ చూసి..
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి కలెక్టర్ గన్ మెన్ వినోద్ ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ మహిళలను రక్షించి, ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీకి చెందిన మర్కంటి రజిత ఇంట్లో భర్త వేధింపులు, అప్పుల వాళ్ళ బాధలు భరించలేక బుధవారం అశోక్ నగర్ కాలనీ రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
అయితే కలెక్టర్ కార్యాలయానికి విధుల నిమిత్తం బైకుపై వెళ్తున్న కలెక్టర్ గన్ మెన్ వినోద్.. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రజితను రక్షించాడు. తన బైకుపై రజితను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దాంతో ఎస్సై రాములు గన్ మెన్ ను అభినందించారు. రజిత కుటుంబ సభ్యులు వినోద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.. తన భర్త ఏ పని చేయకుండా అప్పులు చేస్తూ జులాయిగా తిరుగుతున్నాడని తెలిపింది. అప్పుల వాళ్ళు రోజు ఇంటికి రావడం, ఇంట్లో భర్త వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు వివరించింది.