Kajal: లవ్ ఎమోజీలు కవర్ చేసి కొడుకు ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ అగ్ర హీరోయిన్

by Anjali |   ( Updated:2024-10-15 14:30:28.0  )
Kajal: లవ్ ఎమోజీలు కవర్ చేసి కొడుకు ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ అగ్ర హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. దాదాపు ఈ భామ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. ‘లక్ష్మీ కళ్యాణం, బ్రదర్స్, మగధీర, మిస్టర్ పర్‌ఫెక్ట్ మోసగాళ్లు, బిజినెస్ మేన్, బృందావనం, బ్రహ్మోత్సవం, ఖైదీ నెంబర్ 150, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, డార్లింగ్, దడ, ది ఘోస్ట్, తుపాకీ, ఎవడు, ఆర్య 2, ఆటాడిస్తా’ వంటి చిత్రాల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

కరోనా సమయంలో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. కాజల్ కుమారుడికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యాపార సంస్థ దీపావళి ప్రమోషన్ కోసం ఈ బుడ్డోడిని ట్రెడిషనల్‌గా రెడీ చేసి.. తల్లికొడుకులిద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కిచ్లు ఫేస్ వైట్ కలర్ లవ్ ఎమోజీలతో కవర్ చేసి కాజల్ సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వివాహనంతరం కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది.

Advertisement

Next Story

Most Viewed