- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Best 5G smartphones: కేవలం రూ. 15 వేలకే ఫీచర్ లోడెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్స్..!!
దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ ధరతో ఫీచర్ లోడెడ్ గ్యాడ్జెట్స్ భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. కేవల రూ.15,000 లోపు ధరలో లభించే కొన్ని 5జీ స్మార్ట్ మొబైల్స్ అద్భుతమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. ఈ ఏడాది (2024)సెప్టెంబరులో లాంచ్ అయిన ఇన్ఫీనిక్స్ హాట్ 50 లో 5 జీ కెపాసిటీ ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 6300చిప్‌తో వస్తుంది. అంతేకాకుండా 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా కలిగి ఉన్నాయి.
ఇన్ఫీనిక్స్ హాట్ 50..
4 జీబీ ర్యామ్.. అలాగే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రైజ రూ. 10 వేల లోపు ఉంది. వయొలెట్ బ్లూ, సేజ్ గ్రీన్, స్లీక్ బ్లాక్‌తో పాటు పలు ఫినిషింగ్ లలో ఎంట్రీ లెవల్ 5 జీ మొబైల్ రానుంది. చిన్న పంచ్ హోల్, డిస్ప్లే 6.7 ఇంచ్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ ప్యానెల్, యాపిల్ డైనమిక్ ఐలాండ్‌కి పోటీగా డైనమిక్ బార్ వంటి బెస్ట్ ఫీచర్లు కలిగి ఉంటాయి.
మోటరోలా జీ64 5జీ..
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్తో మోటరోలా జీ 54 వస్తుంది. మోటరోలా జీ45 మాదిరిగానే ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువగా జీ64 కు ఎక్కువ ర్యామ్- మెరుగైన బ్యాటరీ సహా అనేక అదనపు ఫీచర్లు వస్తాయి. కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ ఉంటుంది. దీనితో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ గా ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందిస్తున్నారు.
రెడ్ మీ నోట్ 13 5జీ..
రెడ్ మీ నోట్ 13 5జీ అతితక్కువ ధరకే మంచి ఫీచర్లకు వస్తుంది. కేవలం రూ. 15000 మాత్రమే. దీనికి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 108 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో పాటు సాలిడ్ కెమెరా సెటప్ రానుంది. ఈ స్మార్ట్ మొబైల్ పలు కలర్స్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
నథింగ్ సిఎమ్ఎఫ్ ఫోన్ 1..
ఈ స్మార్ట్ మొబైల్ నథింగ్ సబ్-బ్రాండ్. దాని ఫ్లాగ్షిప్ మోడళ్ల మాదిరిగానే ఓఎస్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే నథింగ్ సిఎమ్‌ఎఫ్ ను లాంచ్ చేశారు. చాలా అట్రాక్టివ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్, ఆరెంజ్, లైట్ గ్రీన్ సహా ఎన్నో రంగులలో లభించే ఇది మాడ్యులర్ బ్యాక్ ప్యానెల్లను కూడా కలిగి ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా , రేర్ కెమెరాల్లో 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరాతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డిస్ప్లే 6.67 ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం 15000 వేల రూపాయలకే లభిస్తోంది.
- Tags
- 5G smartphones