- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన జూపల్లి కృష్ణారావు
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో జూపల్లి ఓటమిచెందారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో జూపల్లి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారిక కార్యక్రమాల సంగతి అటుంచి, కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వనపర్తిలో జరిగిన బహిరంగ సభకు ఆహ్వానం రాకపోవడంతో ఆయన తీవ్రంగా కలతచెందినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి, బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా.. ఈ వార్తలపై జూపల్లి కృష్ణారావు స్పందించారు. వచ్చే 9 నెలల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే.. నా పదవి కోసం కాదని వ్యాఖ్యానించారు.