Junior Women World Cup 2022: దక్షిణ కొరియాను చిత్తు చేసి.. సెమీస్‌‌లోకి టీమిండియా

by Vinod kumar |
Junior Women World Cup 2022: దక్షిణ కొరియాను చిత్తు చేసి.. సెమీస్‌‌లోకి టీమిండియా
X

పోట్చెఫ్స్ట్రూమ్: ఎఫ్‌ఐహెచ్ జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్‌-2022లో టీమిండియా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సౌతాఫ్రికాలోని పోట్చెఫ్స్ట్రూమ్ వేదికగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టీమిండియా జట్టు కొరియాతో తలపడింది. టోర్నీ ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన బ్లూ ఆర్మీ కొరియా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా వారిపై తీవ్ర ఒత్తిడి పెంచారు. మ్యాచ్ ప్రారంభంలో 11 నిమిషంలో క్రీడాకారిణి సలీమా తెటే పెనాల్టీ షాట్‌తో తొలి గోల్ సంపాదించింది. 1-0తో లీడ్‌లో కొనసాగుతున్న టైంలో భారత మహిళ జట్టు ఐకమత్యం తో పాటు తెలివిగా ప్రత్యర్థి జట్టుకు అవకాశం దొరక్కుండా వరుసగా గోల్స్ కొట్టారు. తీరా చివరి క్వార్టర్‌లో 3-0 ఆధిక్యం కనబరిచిన టీమిండియా కొరియా జట్టును చిత్తుగా ఓడించి సెమీస్ ఆశలను సజీవం గా నిలుపుకుంది. కాగా, 2013లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ జూనియర్ మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియా జట్టు సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

Next Story