Telangana News: ప్రాణహిత పుష్కరాలలో హనుమాన్ మహా యాగం

by Vinod kumar |   ( Updated:2022-04-11 10:26:20.0  )
Telangana News: ప్రాణహిత పుష్కరాలలో హనుమాన్ మహా యాగం
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరంలో ప్రాణహిత నది బుధవారం నుంచి ప్రారంభమయ్యే పుష్కరాలలో విశ్వశాంతి శ్రీ హనుమాన్ మహా యాగం నిర్వహిస్తున్నట్లు హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ తెలిపారు. సోమవారం కాటారంలో 'దిశ' తో ఆయన మాట్లాడుతూ.. 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 12 రోజులు విశ్వశాంతి హనుమాన్ మహా యాగం జరుగుతుందని తెలిపారు. పుష్కరాలలో 12 రోజులు సంపూర్ణ రామాయణ పారాయణం, సంక్షేమ రామాయణం, నిత్య హోమం, సుందరాకాండ హోమం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం హోమాలు, పుష్పార్చన మన్యుసూక్త పారాయణ సహిత హోమం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సంకీర్తనలు, అన్నదానాలు ప్రతి నిత్యం నిర్వహిస్తున్నట్లు స్వామిజి వివరించారు. ప్రతిరోజూ కాళేశ్వర క్షేత్రం నందు పవిత్ర ప్రాణహిత నది పుష్కరాలు సందర్భంగా హనుమాన్ మాలాధారణ మంత్రోపదేశం, మాల విరమణ, అనుగ్రహ భాషణం, మంగళ స్నానాలు ఉంటాయని తెలిపారు. ప్రాణహిత నది పుష్కరాలలో భక్తజనం పాల్గొని పునీతులు కావాలని ప్రసాద్ స్వామీజీ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed