Jasprit Bumrah: కోహ్లీకి అలా జరిగిందని నిజంగా తెలియదు: బుమ్రా

by Satheesh |   ( Updated:2022-07-13 12:36:00.0  )
Jasprit Bumrah Says, Dont Know The Status Of Virat Kohlis Injury
X

దిశ, వెబ్‌డెస్క్: Jasprit Bumrah Says, Don't Know The Status Of Virat Kohli's Injury| ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. అతిథ్య ఇంగ్లాండ్‌ను వరుసగా రెండు మ్యాచుల్లో ఓడించి టీ 20 సిరీస్ కైవసం చేసుకున్న బ్లూ ఆర్మీ.. అదే జోష్‌తో వన్డే సిరీస్‌ను ఆరంభించింది. ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో అతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబెలేత్తిపోయారు. టీమిండియా బౌలర్లు బుమ్రా, షమి దాటికి ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో కేవలం 110 పరుగులకే చాపచుట్టేసింది. బుమ్రా ఆరు వికెట్లు సాధించి వన్డే కెరీర్‌లోనే బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఇక సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 6వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికయ్యాడు.

ఈ సందర్భంగా బుమ్రాను విరాట్ కోహ్లీ గాయం గురించి ప్రశ్నించగా.. ఈ స్టార్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి గాయం అయ్యిందన్న విషయం తనకు తెలియదని.. ప్రస్తుతం ఆ గాయం ఏ స్థితిలో ఉందో కూడా తెలియదంటూ జవాబిచ్చాడు. ఎందుకంటే నేనే చివరి టీ 20 మ్యాచ్ ఆడకపోవటం వల్ల ఆ విషయం నాకు తెలియదని వెల్లడించాడు. అయితే, అతడు త్వరగా కోలువాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed