Janhvi Kapoor: హిట్ సినిమా రీమేక్‌లో ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్!

by Hamsa |
Janhvi Kapoor: హిట్ సినిమా రీమేక్‌లో ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్!
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ‘తిను ధడక్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తెలుగులో ఈ అమ్మడు ఎన్టీఆర్(NTR) ‘దేవర’ (Devara)చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు సాధించింది. దేవరతో మెప్పించిన జాన్వీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. తన నటన, అందం, అభినయంతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ప్రజెంట్ ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) RC16 మూవీలో నటిస్తుంది. ఈ క్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఓ హిట్ మూవీ రీమేక్‌లో ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఈరం’(Eeram) తెలుగులో వైశాలి పేరుతో విడుదలైంది.

అయితే 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు టాక్. ఇందులో జాన్వీకి చాన్స్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి మనోజ్ పరమహంస దర్శకుడిగా పరిచయం కానున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కాగా.. 2009లో ‘వైశాలి’ పేరుతో వచ్చిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, నంద, సింధు మీనన్(Sindhu Menon) నటించి మెప్పించారు.

Next Story