- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జల జీవన్ మిషన్‌లో వారిది ప్రధాన పాత్ర.. పీఎం మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్ దేశాభివృద్ధికి కొత్త ఊపునిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ దేశ అభివృద్ధికి నూతన ఒరవడిని తీసుకొస్తుంది. గత మూడేళ్లలో కోట్ల సంఖ్యలో ఇళ్లకు మంచి నీరు అందించాం. ప్రజల ఆకాంక్షలు, ప్రజల భాగస్వామ్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచాం అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం 2019 వరకు దేశంలో 3.23 కోట్ల ఇళ్లకు నీటి సరఫరా ఉంది. జల జీవన్ మిషన్ ప్రారంభించిన తర్వాత 9.40 కోట్ల ఇళ్లకు నీటి సరఫరా సదుపాయాన్ని కల్పించారు. దేశవ్యాప్తంగా ఈ మిషన్ ద్వారా 107 జిల్లాలలోని 1.5 లక్షల గ్రామాలు ప్రయోజనం పొందాయి. అంతేకాకుండా 17.39 లక్షల పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు త్రాగునీరు సరఫరా అందించారు. తాగునీటి నిర్వహణకు 4.82 లక్షల జల కమిటీ ఏర్పాటు చేయగా, దాదాపు 9.69 లక్షల మహిళలు నీటి నాణ్యతను పరీక్షించేందుకు శిక్షణ పొందారు. ఇళ్లకు నీటిని సరఫరా చేయడంతో పాటు వికేంద్రీకరణకు గొప్ప మాధ్యమంగా జల్ జీవన్ మిషన్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ మిషన్‌ను నడుపుతున్నారని ఉద్ఘాటించారు.