ఉత్సాహంగా ముగిసిన పోలీస్ క్రికెట్ మ్యాచ్‌లు

by S Gopi |   ( Updated:2022-03-06 12:15:31.0  )
ఉత్సాహంగా ముగిసిన పోలీస్ క్రికెట్ మ్యాచ్‌లు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: క్రీడలు మానసిక ఉల్లాసం నింపుతాయని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ అన్నారు. పట్టణంలోని గీత విద్యాలయం మైదానంలో ఆర్మూరు రిజర్వు జట్టు వర్సెస్ ఎంటీఓ, జిల్లా గార్డుల మధ్య నిర్వహించిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదివారం ప్రారంభించారు. టాస్ గెలిచిన ఏటీఓ, జిల్లా గార్డుల జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ చేసిన జట్టు నిర్ణీత 15 ఓవర్లకు 119 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్మూరు రిజర్వు జట్టు నిర్ణీత 14.2 ఓవర్లలో 120 పరుగులు చేయడంతో విజయం సాదించింది. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఆర్మూరు రిజర్వు జట్టు నుండి కన్నయ్యకు లభించింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంటీఓ, జిల్లా గార్డుల టీమ్ నుండి వెంకటేష్ కు లభించింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించే పోలీసులకు క్రీడలను ఏర్పాటు చేయడం ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతోపాటు తాము నిర్వహించే విధుల ద్వారా కొద్దిగా ఉపశమనం కలుగడంతోపాటు రాబోవు రోజుల్లో పోలీసులు మరింత ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుందన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు. నిత్యం బిజీగా ఉండే పోలీసులు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. క్రీడలు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపుతోపాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గెలుపు, ఓటమిల గురించి ఆడకుండా క్రీడా స్ఫూర్తితో మ్యాచ్ లను ఆడి మంచి టీమ్ స్పిరిట్ ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం అదనపు డీసీపీ అఖిల మహాజన్, జిల్లా అదనపు ఎస్పీ రూపేష్, డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story