Italy: ఇటలీ ప్రధాని మరియో డ్రాగీ రాజీనామా!

by Satheesh |   ( Updated:2022-07-21 11:46:55.0  )
Italy PM Mario Draghi Resigns
X

రోమ్: Italy PM Mario Draghi Resigns| దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో నేపథ్యంలో ఇటలీ ప్రధాని మరియో డ్రాగీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు తన రాజీనామాను అందజేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేర్‌టేకర్ పాత్రలో కొనసాగనుంది. అయితే రాజీనామా తర్వాత ఏం చేస్తారో ఆ ప్రకటనలో చెప్పలేదు. ఆయన పార్లమెంటును రద్దు చేసి అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని ఈ వారం ప్రారంభంలో రాజకీయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఇరు సభల స్పీకర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విభజనలను అంతం చేయడానికి, వారి విచ్ఛిన్న కూటమిని పునరుద్ధరించడానికి డ్రాగీ ప్రయత్నించినప్పటికీ అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. గత వారమే ఆయన రాజీనామా చేయాలని ప్రయత్నించారు. అధిక జీవన వ్యయాన్ని పరిష్కరించే చర్యలపై విశ్వాస ఓటింగ్‌లో అతనికి మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో క్లీనింగ్ చేస్తే ఎంత జీతమో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed