Jr NTR: ఆయుధ పూజ పాటలో అది డ్యాన్స్ స్టెప్ కాదట.. అసలు ఆ రోజు ఎన్టీఆర్ కు ఏం జరిగిందంటే?

by Prasanna |   ( Updated:2024-10-23 05:47:06.0  )
Jr NTR: ఆయుధ పూజ పాటలో అది డ్యాన్స్ స్టెప్ కాదట.. అసలు ఆ రోజు ఎన్టీఆర్ కు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR) హీరోగా నటించిన దేవర (Devara) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తో రన్ అయిన ఈ మూవీ నేడు రికార్డ్స్ క్రియోట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ దేవర, వర పాత్రలకు ప్రాణం పోశాడు. కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసిన అవేమి పట్టించుకోకుండా యంగ్ టైగర్ కోసం దేవరను జనాలు ఎగబడి చూశారు.

ఈ మూవీ ఇంత భారీ విజయం సాధించడానికి గల కారణం అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ప్రేక్షకులు ఆ సౌండ్స్ ను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా, ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ వేసిన డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆయుధపూజ వీడియో సాంగ్ ను మంగళవారం మూవీ మేకర్స్ విడుదల చేయగా, రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. అయితే, ఈ పాటలోని ఎన్టీఆర్ డాన్స్ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయుధ పూజ షూటింగ్ టైం లో ఎన్టీఆర్ చేతికి గాయమైంది. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఈ పాటలో ఒక చేతిలో కత్తి పట్టుకుని, ఇంకో చేతిని వెనక్కి పెట్టి ఒక స్టెప్ వేశాడు, చాలా మంది అది డ్యాన్స్ మూమెంట్ అనుకున్నారు, కానీ కాదని తెలిసింది. అప్పుడు చేతికి కట్టు ఉండటంతో ఆ స్టెప్పును అలా కవర్ చేశామంటూ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. దీనిపై రియాక్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మమ్మల్ని అలరించడానికి కెమెరా ముందు ఇంత భాదను తట్టుకున్నావా అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed