- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
దిశ, మల్లాపూర్ : రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, కుస్తాపూర్ గ్రామాల్లో గురువారం సొసైటీ, ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ మేరకు ధాన్యం ఎంత కొనుగోలు చేశారు, ఇంకా ఎంతవరకు కొనుగోలు చేయాలని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే సన్నం రకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేయాలని అన్నారు.
అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ ను తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఉపాధ్యాయులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, శ్రీనివాస్, డీఆర్డీఓ, రఘు వరుణ్, ఎమ్మార్వో వీర్ సింగ్, ఎంఈఓ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.