- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
104 రోజులు.. 104 మారథాన్స్.. బ్లేడ్ రన్నర్ హంట్!
దిశ, ఫీచర్స్ : 26.2 మైళ్ల 'మారథాన్'లో పరిగెత్తడమంటే ఆషామాషీ కాదు. నిరంతర ప్రాక్టీస్‌తో పాటు హై ఎనర్జీ, ఫిట్‌నెస్ అవసరం. అలాంటిది ఒక మారథాన్ తర్వాత ఇంకొకటి, ఆ వెంటనే మరొకటి.. ఇలా మూడున్నర నెలల పాటు పోటీల్లో పాల్గొనడం మనుషులతో దాదాపు అసాధ్యమే. కానీ ఓ రన్నర్ మాత్రం అంకితభావంతో 100 రోజుల పాటు 100 మారథాన్లు పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందులోనూ ఆమె బ్లేడ్ రన్నర్ అంటే నమ్మగలమా? ఆ సాహసి గురించి మరిన్ని విశేషాలు.
ఆరిజోనాకు చెందిన ఆంప్యుటీ ఎండ్యూరెన్స్ రన్నర్ 'జాకీ హంట్ బ్రోయిర్స్.. ఆరేళ్ల కిందట రన్నర్‌గా ప్రాక్టీస్ మొదలెట్టింది. తనకు తానే లక్ష్యాలు నిర్దేషించుకుని రన్నర్‌గా అంచెలంచెలుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2022 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య వరుసగా 104 రోజుల్లో 104 మారథాన్స్‌లో పరిగెత్తి సెల్ఫ్-సెట్ ఫీట్‌ను పూర్తి చేసి ఔరా అనిపించింది. 2020లో అమెరికన్ రన్నర్ అలిస్సా క్లార్క్ కూడా 95 మారథాన్లు పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం జాకీ హంట్ ఆ రికార్డ్ బ్రేక్ చేయగా, గిన్నిస్ అధికారిక ధృవీకరణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
సౌతాఫ్రికా టు యూఎస్ :
దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన హంట్-బ్రోయర్స్ యూఎస్ వెళ్లడానికి ముందు ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌లోనూ నివసించారు. 2001లో అరుదైన బోన్ క్యాన్సర్ 'ఎవింగ్ సార్కోమా'తో బాధపడుతున్నట్లు నిర్ధారైన తర్వాత ఆమె కాలు తీసివేశారు. తర్వాత 15 ఏళ్లకు ఆమె తన రన్నింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
'నా శరీరం స్పందించే విధానం తెలియకున్నా ప్రతిరోజూ నూతన శక్తితో ముందడుగు వేశాను. రోజురోజుకీ మరింత ధైర్యాన్ని పొందాను. నిజంగానే మన శరీరం అద్భుతమైంది. ప్రతిరోజూ మారథాన్‌కు ప్రిపేర్ అవ్వడం ఓ యుద్ధం లాంటిది కానీ అందులో పదిశాతం మాత్రమే శారీరకమైంది. మిగతా 90శాతం మెంటల్ ప్రిపరేషన్ కావాలి. అందుకే మీరు కూడా ముందు ఏదైనా చేయగలమని నమ్మండి. నిజానికి నేను 5 కిలోమీటర్ల పరుగుతో ప్రారంభించి, క్రమంగా దూరాలను అధిగమిస్తూ10k, హాఫ్-మారథాన్స్, మారథాన్స్, ఇప్పుడు అల్ట్రా-మారథాన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. కొలరాడోలో 100-మైళ్ల రేసులో పోటీ పడేందుకు శిక్షణ పొందుతున్నాను. దీనిని 'రేస్ అక్రాస్ ది స్కై' అని పిలుస్తారు. నిజంగా పరుగు అనేది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రస్తుత ఫీట్ ద్వారా రన్నింగ్ బ్లేడ్స్ అందించే చారీటీ సంస్థలకు విరాళాలు కూడా అందించాను.
- జాకీ హంట్ బ్రోయర్స్