సూర్యాపేటలో ఐటీ హబ్.. కాలిఫోర్నియాలో ప్రకటించిన మంత్రి కేటీఆర్

by Nagaya |
సూర్యాపేటలో ఐటీ హబ్.. కాలిఫోర్నియాలో ప్రకటించిన మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు అందింది. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది. జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ హబ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మరియు పురపాలన శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకుగాను గ్లోబల్ ఐటీ సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed