- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Isha Koppikar: ఆ హీరో నాతో పడుకోమని పిలిచాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్
Isha Koppikar
దిశ, సినిమా: 'చంద్రలేఖ' సినిమాలో నాగార్జున సరసన నటించిన బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టని నటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో చెప్పింది. 'ఇండస్ర్టీలో ప్రతిభ చూపించుకోవడమే ముఖ్యమని భావించాను. కానీ, కొందరు హీరోలు, నిర్మాతలు శరీరాన్ని కోరుకుంటారని కొంత కాలానికి తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనతో నా హృదయం ముక్కలైంది. దీంతో సినిమాల్లో పనికన్నా జీవితమే ముఖ్యమని అనిపించింది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకుని గర్వంగా ఫీలవ్వాలి. ఎవరిముందో మోకరిల్లి, ఒళ్లు అమ్ముకుని బతుకీడ్చడం నాకు నచ్చదు' అని చెప్పుకొచ్చింది. ఇక గతంలో ఓ హీరో కాల్ చేసి ఒంటరిగా రమ్మని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడన్న నటి.. అవకాశాల కోసం దిగజారిపోనని కడిగిపారేశానని, దీంతో సినిమా నుంచి తప్పించారని వివరించింది.
- Tags
- Isha Koppikar