'RRR'ని ఫాలో అవుతున్న కేజీఎఫ్.. భారీ బడ్జెడ్‌తో ప్లాన్

by Javid Pasha |   ( Updated:2022-03-23 03:19:49.0  )
RRRని ఫాలో అవుతున్న కేజీఎఫ్.. భారీ బడ్జెడ్‌తో ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: 'ఆర్ఆర్ఆర్' మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్‌లో భాగంగా జక్కన్న భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌తోనే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్స్ ఇస్తున్నాడు. ఆఖరికి ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సైతం మినీ బడ్జెట్ మూవీగా చేశాడు. సినిమా రిలీజ్ అవుతున్న ప్రతి భాషలోనూ వరుస ఇంటర్వ్యూలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమా 'కేజీఎఫ్ 2' తన ప్రమోషన్స్‌లో 'ఆర్ఆర్ఆర్'ను ఫాలో అవ్వనుందట.

'కేజీఎఫ్ 2' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడట. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌తో అదరగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌తోనే వండర్స్ క్రియేట్ చేస్తారని టాక్ నడుస్తోంది. మరి మేకర్స్ తమ ప్లాన్‌పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Advertisement

Next Story