- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ అదే..!
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఏప్రిల్ నెలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 15వ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు . 2016 నుండి 2021 విద్యా సంవత్సరాలలో విశ్వ విద్యాలయం వివిధ కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి స్నాతకోత్సవ పట్టా పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. స్వయంగా పట్టాను స్వీకరించాలని అనుకునే వారు రూ.1000 మొత్తాన్ని, పోస్టు ద్వారా పొందాలనుకునే వారు రూ.1200లను దరఖాస్తు ఫీజుగా రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరిట డీడీ చెల్లించాలని కోరారు. దరఖాస్తు పత్రాన్ని విశ్వ విద్యాలయం వెబ్ సైట్ www.teluguuniversity.ac.an నుండి పొందవచ్చిని ఆయన సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోగా పరీక్షల నియంత్రణాధికారి, పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, హైదరాబాద్ 500004 చిరునామాకు పంపాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.