మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

by Satheesh |
మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో (08) మెడికల్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ కొరకు కాంట్రాక్టు పద్దతిన ఒక సంవత్సరం పాటు పని చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తుకారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంబీబీఎస్ విద్యతో పాటు.. ఆ సర్టిఫికెట్ ఏపి లేదా టీఎస్ మెడికల్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు బయో - డాటాతో పాటు అన్ని సర్టిఫికెట్ల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు సాయంత్రం 5:00 గంటల లోపు దరఖాస్తులను జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో అందజేయాలని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు రూ.52,351/- వేతనం చెల్లించబడునని, అవసరమైన మార్గదర్శకాల కొరకు సంబంధిత వెబ్ సైట్ నుండి సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Next Story