- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Instagram లో కొత్తగా మెసేజింగ్ ఫీచర్స్!
దిశ, ఫీచర్స్ : ఫొటో షేరింగ్ యాప్‌గా మొదలైన ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌కు తగ్గట్లు మారుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది. ప్రత్యేకించి యువత ఎక్కువ కనెక్ట్ కాగా.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మెసేజింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు కొత్తగా ఏడు ఫీచర్స్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.
రిప్లయ్ వైల్ యువర్ బ్రౌజ్ : సాధారణంగా ఇన్‌స్టాలో బ్రౌజ్ చేస్తుండగా మెసేజ్ రావడం సహజం. ఇలాంటి సందర్భంలో ఇన్‌బాక్స్‌కు వెళ్లి రిప్లయ్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ కొత్త ఫీచర్‌తో డైరెక్ట్‌గా రిప్లయ్ ఇచ్చే అవకాశాన్ని కల్పించింది ఇన్‌స్టా.
క్విక్‌లీ సెండ్ టు ఫ్రెండ్స్ : బ్రౌజింగ్‌లో కొన్ని కంటెంట్స్ చూసినప్పుడు వాటికి అట్రాక్ట్ అయిపోతుంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహా నచ్చిన వారికి పంపేందుకు వీలుగా ఇన్‌స్టాలో కొత్తగా షేరింగ్ ఆప్షన్ వచ్చింది. ఇందుకోసం షేరింగ్ బటన్‌పై ట్యాప్ చేసి, ఆయా పోస్ట్‌లను రీషేర్ చేయొచ్చు.
ఆన్‌లైన్‌లో ఎవరున్నారు? : ఆన్‌లైన్‌లో ఎవరు అందుబాటులో ఉన్నారో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ పైభాగాన చూడొచ్చు. స్నేహితులతో కనెక్ట్ చేయడంలో ఇది దోహదపడుతుంది.
ప్లే, పాజ్ అండ్ రిప్లయ్ : ఆపిల్, అమెజాన్ మ్యూజిక్ సహా స్పోటిఫైలో వినియోగదారులు తాము వింటున్న పాటకు సంబంధించిన 30-సెకన్ల ప్రివ్యూను ఈ ఫీచర్ సాయంతో షేర్ చేయొచ్చు. దీంతో వాళ్లు నేరుగా చాట్ విండో నుంచి కూడా మనం షేర్ చేసిన పాటల్ని వినే అవకాశముంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు కానీ త్వరలోనే ఇన్‌స్టా తన యూజర్లకు ఇంట్రడ్యూస్ చేయనుంది.
సెండ్ మెసేజెస్ క్వైట్‌లీ : మెసేజ్‌లో '@silent'ని జోడించడం ద్వారా రాత్రిపూట లేదా ఒకరు బిజీగా ఉన్నప్పుడు మెసేజ్‌లను పంపవచ్చు.
కీప్ ఇట్ ఆన్ ద లో-ఫై : చాటింగ్ విషయాలను మరింత గోప్యంగా, పర్సనల్‌గా ఉంచేందుకు లో-ఫై చాట్ థీమ్‌ను ప్రయత్నించవచ్చు.
క్రియేట్ ఏ పోల్ విత్ యువర్ స్క్వాడ్ : స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలనుకుని, ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ కాలేకపోతున్నారా? డిన్నర్‌కు ప్లాన్ చేశారు గానీ ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? ఈ గ్రూప్ చాట్ ఫీచర్‌లో పోల్ నిర్వహించుకునే అవకాశముంది.
ఈ కొత్త ఫీచర్లు కొన్ని దేశాల్లో మాత్రమే విడుదల చేయగా.. రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇన్‌స్టా యోచిస్తోంది.
పాటలు కూడా వినిపించగలిగే సరికొత్త సన్ గ్లాసెస్