ఏప్రిల్‌ 2: అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం

by Harish |
ఏప్రిల్‌ 2: అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏట ఏప్రిల్‌ 2వ తేదీన అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు డెన్మార్క్‌కు చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత 'హాన్స్‌ క్రిస్టియన్‌ అండర్సన్‌' జయంతి. ఈయన ప్రపంచవ్యాప్తంగా పిల్లలను అమితంగా ఆకర్షించిన 'ది లిటిల్‌ మర్మెయిడ్‌', 'ది అగ్లీ డక్లింగ్‌' పుస్తకాలు రాశాడు. క్రిస్టియన్ గౌరవార్థంగా 1967 నుంచి 'ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఆన్‌ బుక్స్‌ ఫర్‌ యంగ్‌ పీపుల్‌' అనే స్వచ్ఛంద సంస్థ బాలల పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు 70కి పైగా దేశాల్లో పనిచేస్తోంది. నిజానికి బాల సాహిత్యం మొట్టమొదట పుట్టింది ఇండియాలోనే అని, క్రీ పూ 200 సంవత్సరంలో విష్ణుశర్మ రచించిన 'పంచతంత్రం' కథలు ఇప్పటికీ ఆకట్టుకోవడమే అందుకు సాక్ష్యమని కొంతమంది చెబుతుంటారు.

Advertisement

Next Story