- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాలో 'పేరెంటల్ సూపర్ విజన్' టూల్స్!
దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ వినియోగంతో యూత్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుందనే ఆందోళనలు రేకెత్తిన విషయం తెలిసిందే. అందుకే పేరెంట్ కంపెనీ మెటా తమ ఫొటో-షేరింగ్ యాప్‌లో పిల్లల యాక్టివిటీని తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు సరికొత్త ఫీచర్స్ రిలీజ్ చేయనుంది. ఇంతకీ ఈ ఫీచర్స్ స్పెషాలిటీ ఏంటీ? తల్లిదండ్రులకు ఎంతమేర ఉపయోగపడనుందో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇన్‌స్టాను వాడుతుండగా.. ఇందులోని ఫిల్టరింగ్ ఫీచర్స్ యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా అందులో ఉన్న మోడల్ షేప్‌లో తాము లేమని, అంత అందంగా కనిపించేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపాయని ఫేస్‌బుక్ ఒప్పుకుంది.
తద్వారా సూసైడ్ టెండెన్సీస్ కూడా పెరిగిపోయాయనే విషయాన్ని నిర్ధారించారు నిపుణులు. ఈ విమర్శలతో చిన్నారులు, టీనేజర్స్ ఇన్‌స్టా వినియోగంపై పేరెంట్స్ నియంత్రణ కలిగి ఉండేలా సూపర్ విజన్ టూల్ డెవలప్ చేసింది ఇన్‌స్టాగ్రామ్. పిల్లలు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎంత సేపు గడుపుతున్నారు.. ఎవరెవరిని ఫాలో అవుతున్నారు.. ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు.. అనే విషయాలను పేరెంట్స్ పర్యవేక్షించేలా ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త ఫీచర్.. రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెటా పేర్కొంది.
మెటాకు చెందిన వర్చువల్-రియాలిటీ హెడ్‌సెట్స్, ప్లాట్‌ఫామ్‌లకు కూడా పేరెంట్స్ కంట్రోల్స్ రానున్నాయి. ఈ మేరకు తమ క్వెస్ట్ హెడ్‌సెట్స్ పర్యవేక్షణ సాధనాలను కలిగి ఉన్న డ్యాష్‌బోర్డ్‌ను మేలో లాంచ్ చేయనుంది. క్వెస్ట్‌లో వయసుకు తగని యాప్స్ డౌన్‌లోడ్ చేయకుండా టీనేజర్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. వివిధ యాప్స్‌తో పాటు సాంకేతికతలను పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు పర్యవేక్షించే ఒక స్థలాన్ని కలిగి ఉండాలనే లక్ష్యంతో మెటా నిర్మిస్తున్న 'ఫ్యామిలీ సెంటర్'లో ఇదంతా భాగమని కంపెనీ పేర్కొంది.