Instagram యూజర్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ఇకపై మీకు ఇష్టమైన ఫీచర్లు అందుబాటులోకి

by Javid Pasha |   ( Updated:2022-03-30 00:30:42.0  )
Instagram యూజర్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ఇకపై మీకు ఇష్టమైన ఫీచర్లు అందుబాటులోకి
X

దిశ, ఫీచర్స్ : ఇమేజ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఇప్పటి వరకు స్టోరీస్‌కు టెక్స్ట్ ద్వారా మాత్రమే రిప్లయ్ ఇచ్చే అవకాశముండగా.. త్వరలో ఆడియో, ఇమేజ్‌తోనూ రిప్లయ్ ఇచ్చేందుకు అవకాశం కల్పించనుంది. 'Alessandro Paluzzi@alex193a' అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇందుకు సంబంధించిన సమాచారం పోస్ట్ అయింది. ఈ ఫీచర్ స్నాప్‌‌చాట్‌ను పోలినట్లు కనిపిస్తుండగా.. క్విక్ రియాక్షన్ కోసం GIF, వాయిస్ మెసేజ్ ఆప్షన్ ఇచ్చారు.

అంతేకాదు యూజర్ ఆన్‌‌లైన్‌‌లో ఉన్నట్లుగా తెలిపే సింబల్ రిప్లయ్ బటన్ దగ్గరే ఉంది. దీంతోపాటు తమ స్టోరీస్ ఎవరు చూశారో తెలుసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్న ఇన్‌స్టా.. ఆ యాక్టివిటీని కొందరే చూడాలనుకుంటే 'క్లోజ్ ఫ్రెండ్స్ కేటగిరి'తో పరిష్కారం చూపబోతోంది. ఇక న్యూస్ ఫీడ్‌కు న్యూ లుక్ యాడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్.. ప్రొఫైల్‌లోని ట్యాబ్‌ బటన్స్‌పై కూడా పనిచేస్తోంది. ఇవి సబ్‌స్క్రైబర్స్ కోసం ప్రత్యేక కంటెంట్‌ను కలెక్ట్ చేసే అవకాశం ఉండగా.. QR కోడ్ ద్వారా పోస్ట్‌లు షేర్ చేసే నయా ఫీచర్‌ను సరికొత్తగా అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Next Story

Most Viewed