ఫ్లాష్.. ఫ్లాష్.. కేటీఆర్ కాలికి గాయం.. ఆందోళనలో టీఆర్‌ఎస్ వర్గాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-19 14:08:28.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. కేటీఆర్ కాలికి గాయం.. ఆందోళనలో టీఆర్‌ఎస్ వర్గాలు
X

దిశ, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి స్వల్ప గాయం అయింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పెద్ద ప్రమాదం ఏం కాదని, మూడు వారాల పాటు డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ బర్త్ డేకు కార్యకర్తలు, క్యాడర్ మొత్తం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలియడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడిపోయారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కేటీఆర్ బర్త్ డే రోజు పలువురు మంత్రులు, పార్టీ ప్రముఖులు కూడా కలిసే పరిస్థితి లేదని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story